ఎర్రచందనం దుంగలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Sep 29 2026 12:21 AM | Updated on Sep 29 2026 12:21 AM

వీరబల్లి : మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు సోమవారం పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. వీరబల్లి మండల పరిధిలోని సీతంపేట సమీప అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఎస్‌ఐ సుస్మితకు ముందస్తు సమాచారం అందింది. దీంతో ఆమె తన సిబ్బందితో కలిసి సోమవారం తెల్లవారుజామున సదరు ప్రాంతంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 11 ఎర్రచందనం దుంగలు, రవాణాకు ఉపయోగించిన ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో అప్రమత్తమైన పోలీసులు ఎర్రచందనం తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఒక ప్రధాన నిందితుడిని, అలాగే కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఎస్‌ఐ సుస్మిత తెలిపారు. సమయస్ఫూర్తితో దాడి చేసి నిందితులను పట్టుకున్న రూరల్‌ సీఐ సురేష్‌ రెడ్డిని, ఎస్‌ఐ సుస్మితను, పోలీస్‌ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ దాడిలో పలువురు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement