వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ’గేట్ – జామ్ 2027 పరీక్షలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం విజయవంతమైందని డైరెక్టర్ ప్రొఫెసర్ జి. విజయప్రకాష్ తెలిపారు. క్యాంపస్‌లోని ఉన్నత విద్య, పోటీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఈ సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్, మాజీ గేట్ ఛైర్మన్ సురేష్ కుమార్ రాయల్ విశిష్ట వక్తగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ స్థాయి పరీక్షలైన గేట్ , జామ్ ద్వారా లభించే ఉన్నత విద్యా అవకాశాలు, పరిశోధన రంగాలు, సన్నద్ధత వ్యూహాలను ఆయన విద్యార్థులకు వివరించారు. ఐఐటీ మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణుల మార్గదర్శకత్వం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని డైరెక్టర్ పేర్కొన్నారు. ఈ సదస్సుకు విద్యార్థుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ప్రత్యక్షంగా, మరో 500 మందికి పైగా ఆన్‌లైన్ ద్వారా వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ పరిపాలన అధికారి పెనుగొండ రవి కుమార్, విద్యార్థి సంక్షేమ డీన్ వెంకటేష్, సెంట్రల్ ఆర్.డి డీన్ కొండారెడ్డి, డాక్టర్ ఎం. భాస్కరయ్య, పాల్గొన్నారు.


