ప్రజాపక్షమే వైఎస్సార్‌ సీపీ విధానం | - | Sakshi
Sakshi News home page

ప్రజాపక్షమే వైఎస్సార్‌ సీపీ విధానం

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

కడప కార్పొరేషన్‌ : అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడటమే వైఎస్సార్‌ సీపీ విధానమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. ఆదివారం కడప నగరంలోని టుటౌన్‌ పోలీసుస్టేషన్‌ ఎదురుగా ఉన్న వీధిలో టీడీపీకిచెందిన చాంద్‌బాష, వహీద్‌, అన్వర్‌లతోపాటు 120 కుటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలోచేరారు. వారికి అంజద్‌బాష కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని, వారి చేరికలతో వైఎస్సార్‌సీపీ మరింత బలపడుతుందన్నారు. పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో సముచిత స్థానం కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. వైఎస్‌ జగన్‌ ఐదేళ్లపాలన, ప్రస్తుత చంద్రబాబు పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను ప్రకటించిన సమయానికి ఠంఛనుగా అమలు చేసి ప్రజలకు అందించిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో ఆ స్థాయిలో సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందా? అన్నది ప్రజలు ఆలోచించాలన్నారు. ఉద్యోగాలు, సంక్షేమం, అభివృద్ది విషయంలో ఈ ప్రభుత్వం ఏం పురోగతి సాఽధించిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎవరి హయాంలో ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. కడప ఎమ్మెల్యే మాధవి నగర అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తీసుకు వచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మంజూరైన నిధులతో జరుగుతున్న పనులకు ఈ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే క్రెడిట్‌ తీసుకోవడం సరికాదన్నారు. కడప నగరానికి శాశ్వత తాగునీటికోసం బ్రహ్మంసాగర్‌ నుంచి 1.5 టీఎంసీల నీటిని కేటాయించి నిధులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఇసుక, మట్టి, రియల్‌ఎస్టేట్‌ వ్యవహారాలపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, అక్రమ కేసులతో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే వెనక్కి తగ్గేదిలేదని, ప్రజల హక్కులు, సమస్యల కోసం నిరంతరం పోరాడుతామన్నారు. ఎన్నికలుపూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని, నిబంధనలకు విరుద్దంగా వ్యవహారిస్తే ప్రజాస్వామ్య పద్దతిలో ప్రశ్నిస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్‌ మళ్లీ గిరాగిరా తిరిగేలా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలోమాజీ మేయర్‌ పాకా సురేష్‌కుమార్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ బండి నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తోట కృష్ణ, మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలీ అక్బర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జమీల్‌, మాజీ కార్పొరేటర్లు షఫీ, షంషీర్‌, అజ్మతుల్లా, పవర్‌ అల్తాఫ్‌, గౌస్‌, స్థానిక నాయకులు అవినాష్‌రెడ్డి, సొహైల్‌ ఖాన్‌, షఫీ, షాబుద్దీన్‌ పాల్గొన్నారు.

– టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలోకి భారీగా చేరికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement