హోటల్‌లో గ్యాస్‌ లీక్‌ | - | Sakshi
Sakshi News home page

హోటల్‌లో గ్యాస్‌ లీక్‌

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

హోటల్‌లో గ్యాస్‌ లీక్‌ విద్యుత్‌ కేబుల్‌ చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్‌ ఆలయంలో చోరీ ఘర్షణలో ఒకరికి గాయాలు

వేంపల్లె : వేంపల్లెలోని పులివెందుల రోడ్డులో ఉన్న విహారి హటల్‌ లో గ్యాస్‌ లీక్‌ అయ్యి మంటలు చెలరేగాయి. హటల్‌ యాజమాన్యం అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఆదివారం హోటల్‌లోని కిచెన్‌ గదిలో వంటలు చేస్తుండంగా గ్యాస్‌ సిలిండర్లకు చెందిన పైపుల నుంచి గ్యాస్‌ లీక్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వంట మనుషులు గదిలోనే ఉండి పోయారు. సమాచారం అందుకున్న ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది హుటాహుటిన హటల్‌ వద్దకు వచ్చి మంటలను ఆర్పడంతో పాటు గదిలో ఉన్న వంట మనుషులను కూడా బయటికి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో హటల్‌ యాజమాన్యంతో పాటు పలువురు ఊపిరి పీల్చుకున్నారు.

ప్రొద్దుటూరు క్రైం : విద్యుత్‌ వైరు చోరీకి పాల్పడిన ముగ్గురిని త్రీ టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు వివరాలను ఆదివారం సాయంత్రం ఎస్‌ఐ సంజీవరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ నెల 24న అర్దరాత్రి సమయంలో పట్టణంలోని ఎస్‌ఎస్‌ మాల్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 85 మీటర్ల విద్యుత్‌ వైర్‌ను దొంగలించారు. చోరీకి గురైన విద్యుత్‌ వైర్‌ విలువ రూ. 1 లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రతిమా స్టీఫెన్‌ ఫిర్యాదు మేరకు 25న త్రీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీపుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. బైపాస్‌ రోడ్డులోని టీవీఆర్‌ పెట్రోల్‌ బంకు వద్ద ఉన్న నిందితులు రాజీవ్‌నగర్‌కు చెందిన కొట్టం నాగార్జున, ఎర్రన్నకొట్టాలకు చెందిన అరకటవేముల వెంకటేష్‌, బండారు శ్రీనివాసులును అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 68 మీటర్ల విద్యుత్‌ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పెండ్లిమర్రి: మండలంలోని వెల్లటూరు గ్రామ సమీపంలోని శ్రీవరసిద్ధి వినాయక ఆలయంలో చోరీ జరిగింది. స్థానికులు,ఆలయ నిర్వహకులు కథనం మేరకు..ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు హుండీ పగలగొట్టి నగదు దోచుకెళ్లారు. గతంలో కూడా ఇదే ఆలయంలో చోరీ జరిగిందన్నారు. హుండీలు చోరీ చేసే ముఠాపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

పులివెందుల రూరల్‌: పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరంగాపురంలో గత కొంత కాలంగా నీటి సమస్యలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో మున్సిపల్‌ అధికారులు పెద్దరంగాపురం గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరపరా చేస్తున్నారు. ఆదివారం ట్యాంకర్‌ గ్రామానికి వెళ్లడంతో ముందుగా మాఇంటి దగ్గర పె ట్టాలంటే.. కాదు మా ఇంటి దగ్గర అని అఖిల్‌కుమార్‌రెడ్డి, శ్రీదేవి ఘర్షణ పడ్డారు. అఖిల్‌కుమార్‌ రెడ్డిని శ్రీదేవి కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement