కడప అర్బన్: కడపలోని కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా సదన్‌న్‌లో జిల్లాలోని న్యాయూర్తులకు ఆదివారం నిర్వహించిన వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, వైఎస్సార్ కడప జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ తార్లాడ రాజశేఖర్‌రావు చైర్‌పర్సన్‌న్‌గా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ మెడమల్లి గౌరవ అతిథిగా హాజరయ్యారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామగోపాల్ వారికి సాదర స్వాగతం పలికారు. రిసోర్స్ పర్సన్లుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తులు బి.సత్యనారాయణ, జి.అన్వర్ బాషా పాల్గొన్నారు. కడప జిల్లాలోని అన్ని న్యాయస్థానాలకు చెందిన న్యాయాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేసుల నిర్వహణ, సత్వర పరిష్కారంపై హైకోర్టు న్యాయమూర్తులు పలు సూచనలు, మార్గదర్శకాలు అందించారు.


