కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కడప కేంద్రంగా ఆదివారం నుంచి ప్రారంభం కాను న్న సీపీఐ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలకు కడప ముస్తాబైంది. నగరంలోని ప్రధాన కూడళ్ల నిండా ఎర్రజెండా తోరణాలే కనిపిస్తున్నాయి. ఈ నెల 30 వరకు జరగనున్న ఈ సమావేశాలకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శులు కే రామకష్ణ పల్లా వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య తో పాటు జాతీయ రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య సొంత జిల్లా కావడంతో జిల్లా పార్టీ శ్రేణులు ఏర్పాటల్లో నిమగ్నమయ్యారు.


