రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

కమలాపురం: స్థానిక బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల/ కళాశాలకు చెందిన విద్యార్థినులు రాష్ట్ర స్థాయి గట్కా పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్‌ తులశమ్మ తెలిపారు. ఈ నెల 17న చెన్నూరు మండలం, రామనపల్లె జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి గట్కా పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారని ఆమె వివరించారు. అండర్‌–17 విభాగంలో టెన్త్‌ క్లాస్‌కు చెందిన ప్రణవి నైన్త్‌కు చెందిన స్వాతి గట్కా పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. అలాగే 18న అండర్‌–19 విభాగంలో మైదుకూరులోని మేధా డిఫెన్స్‌ అకాడమీ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి గట్కా పోటీలలో సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్న టి.మల్లిక, వై. స్రవంతి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆమె తెలిపారు. ఈ నెల 30వ తేదీన గుంటూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు తమ పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రాతినిథ్యం వహిస్తారని ఆమె వివరించారు. కాగా విజేతలతో పాటు పీఈటీ కళావతిని ప్రిన్సిపల్‌ తులసమ్మ, వీపీ స్వర్ణకుమారి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement