వేంపల్లె : మండలంలోని ఇడుపులపాయ గ్రామంలోని మారుతి నగర్‌కు చెందిన 10 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరాయి. శనివారం గండి మాజీ దేవస్థాన చైర్మన్ కృష్ణతేజ ఆధ్వర్యంలో ఇడుపులపాయ మారుతి నగర్‌కు చెందిన టీడీపీ కార్యకర్తలు పెద్దింటి చిన్న రెడ్డయ్య, పెద్దింటి బాబు, తుమ్మలూరు కుళ్ళాయప్ప, బంగారు గంగయ్య, పెద్దింటి విష్ణువర్ధన్, యంగళ్ల విశ్వనాథ్, మామిళ్ళపల్లి చిన్న కుళ్ళాయప్పలతోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన వారందరికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి కార్యకర్తలు చేరడంతో టీడీపీకి షాక్ తగిలింది. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు పోతిరెడ్డి శ్రావణ్ కుమార్, పి.జి.గోపినాథ్, సుధాకర్, సుకర్ణ, మాజీ ఉపసర్పంచ్ కోలా శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ ముద్దనూరు హనుమంతు, రామాంజనేయులు, వెంకటరత్నం, పెద్దపాగ శ్రీరాములు పాల్గొన్నారు.


