రైతుబజార్‌లో మహిళా రైతుపై దాడి | - | Sakshi
Sakshi News home page

రైతుబజార్‌లో మహిళా రైతుపై దాడి

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

బద్వేలు అర్బన్‌ :స్థానిక సిద్దవటం రోడ్డులోని మార్కెట్‌యార్డు ఆవరణలో గల రైతుబజార్‌లో కూరగాయలు విక్రయించే ఓ మహిళా రైతుపై ఓ వ్యక్తి శనివారం దాడి చేశాడు. రైతుబజార్‌లో ఉన్న గదుల్లో కాకుండా బయట కొంతమంది కూరగాయలు విక్రయిస్తుంటారు. బయట కూరగాయలు విక్రయించే స్థలం కోసం ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది. రైతుబజార్‌పై మున్సిపల్‌ అధికారులు, మార్కెటింగ్‌శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతుబజార్‌ ఆవరణలో ఎవరికి వారు విక్రయాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

రూ.15 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరణ

గోపవరం : మండలంలోని వల్లెరవారిపల్లె గ్రామంలో వెలసిన స్వయంభు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భాద్రపద మాసం పౌర్ణమి సందర్భంగా శనివారం స్వామి వారిని రూ.15 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆయ ప్రధాన అర్చకులు పెంచలయ్యస్వామి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌర్ణమి శనివారం చాలా అరుదుగా వస్తుందని, అలా లక్ష్మీ అలంకరణలో భక్తులు దర్శనం చేసుకోవడం వలన రుణబాధలు తొలగిపోయి ధనాకర్షణ కలుగుతుందని, దీర్ఘకాల ధన సమస్యలు తొలగి మనస్సు ఆనందంగా ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement