అంగన్‌వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా రాచమల్లు రమాదేవి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా రాచమల్లు రమాదేవి

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

ప్రొద్దుటూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అంగన్‌వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సతీమణి, మాజీ కౌన్సిలర్‌ రాచమల్లు రమాదేవిని నియమించారు. పలు మార్లు కౌన్సిలర్‌గా పనిచేసిన ఆమెకు ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది. ఈమేరకు ఆమెను పార్టీ ఈ పదవిలో నియమించింది. వైఎస్సార్‌ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా గోపవరం మాజీ ఉప సర్పంచ్‌ బీరం రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధికార ప్రతినిధిగా వై.ప్రసన్న కుమార్‌ను నియమిస్తూ పార్టీ ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు జడ్జిలను

కలిసిన జిల్లా కలెక్టర్‌

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జరిగే జ్యుడిసియల్‌ వర్క్‌ షాప్‌ –3 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తులను శనివారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర అతిథి గృహంలో బస చేసిన రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటీవ్‌ జడ్జి, వర్క్‌ షాప్‌ చైర్‌ పర్సన్‌ జస్టిస్‌ టి. రాజశేఖర్‌ రావు, గౌరవ అతిథిగా విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు జడిఎం. బాలాజీని కలెక్టర్‌ కలిసి మొక్కను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement