సిద్ధవటేశ్వరుడికి మల్లన్న కరుణ | - | Sakshi
Sakshi News home page

సిద్ధవటేశ్వరుడికి మల్లన్న కరుణ

Aug 2 2026 1:10 AM | Updated on Aug 2 2026 1:10 AM

రాజంపేట: శ్రీశైలం క్షేత్ర దక్షిణ ముఖద్వారమైన సిద్ధవటం జ్యోతి గ్రామంలోని చారిత్రక ‘శ్రీ సిద్ధవటేశ్వరస్వామి’ ఆలయానికి దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు మోక్షం లభించింది. తీవ్ర శిథిలావస్థకు చేరి న ఈ దత్తత ఆలయ జీర్ణోద్ధరణ, దశలవారీ అభివృద్ధి పనులకు శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దే వస్థానం బోర్డు ఆమోదం తెలిపింది. ఈ పురాతన ఆల య దుస్థితిపై జూలై 11న ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘జ్యోతికి దక్కని ఇంధనం’ అనే ప్రత్యేక కథనం దే వస్థానం బోర్డులో కదలిక తెచ్చింది. స్పందించిన శ్రీశై లం దేవస్థానం అధికారులు, చైర్మన్‌ పోతుగుంట రమే ష్‌ నాయుడు ఇటీవల ఆలయాన్ని స్వ యంగా పరిశీలించారు. అనంతరం చైర్మన్‌ రమేష్‌ నా యుడు అధ్యక్షతన గత నెల 28న నిర్వహించిన 9వ ధ ర్మకర్తల మండలి (ట్రస్ట్‌ బోర్డు) సమావేశంలో.. సిద్ధవటేశ్వరాలయ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం

ఈ ఆలయానికి ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉంది. కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమదేవి ఈ స్వామివారికి వెండి రథం, వజ్ర కిరీటాన్ని సమర్పించినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. 12వ శతాబ్దంలో ‘రక్కసి గంగారాయదేవ’ అనే రాజు వద్ద రంగరక్షకుడిగా ఉన్న ‘జంటిమ నాయకుడు’ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత బ్రిటిష్‌ కాలంలో ప్రముఖ చరిత్రకారులు కల్నల్‌ మెకంజి (1806), రాబర్ట్‌ సీవెల్‌ (1878) ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి విశేషాలను రికార్డు చేశారు. అయితే, తదుపరి కాలంలో నవాబుల పాలనలో ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి, ఇసుకలో పూడ్చివేశారని సమాచారం.

పురావస్తు తవ్వకాల్లో వెలుగు చూసిన

ఆలయం.. 108 శివలింగాలు!

సుదీర్ఘ కాలం ఇసుక దిబ్బల్లో పూడుకుపోయిన ఈ క్షే త్రం.. 2002, 2004, 2006 మధ్య పురావస్తు శాఖ జరి పిన తవ్వకాలలో తిరిగి బయల్పడింది. మొత్తం 108 శిలలతో కూడిన ఈ చారిత్రక దేవాలయంలోని అన్ని శివలింగాలను శాస్త్రోక్తంగా తిరిగి పునఃప్రతిష్ఠ చేయాల ని భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

మ్యూజియం ఏర్పాటు..

ఆలయ జీర్ణోద్ధరణకు శ్రీశైలం దేవస్థానం ముందుకు వచ్చిన నేపథ్యంలో.. తవ్వకాల్లో బయటపడి ప్రస్తుతం చైన్నె మ్యూజియంలో భద్రపరిచిన శిల్పాలు, చారిత్రక అవశేషాలను తిరిగి ఇక్కడికి రప్పించి, ఆలయ ప్రాంగణంలోనే మ్యూజియం ఏర్పాటు చేయాలని భక్తులు కో రుతున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన భూము లు ఆక్రమణల పా లయ్యాయని, వాటిని తిరిగి ఆలయానికి స్వాధీనం చేసేలా జిల్లా కలెక్టర్‌ చర్య లు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.

సిద్ధవటేశ్వరాలయానికి మహర్దశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement