రాజంపేట : పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలిలో నిర్వహిస్తున్న శివ, కేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. కాగా శనివారం అశ్వవాహనంపై శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో ఊరేగారు. భక్తులు కాయర్పూరం సమర్పించారు. అంతకుముందుగా ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ఆసీనులు చేశారు. అలాగే శ్రీ సిద్దేశ్వరస్వామికి పారేటి ఉత్సవం నిర్వహించారు. చివరి రోజున శ్రీ సిద్దేశ్వరస్వామికి వసంత్సోవం, త్రిశూలస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించారు.


