నేను 9 ఎకరాల్లో ఆరుపడి పంటలైన పత్తి, పసుపును సాగు చేశారు. ఇటీవల గాలులు విపరీతంగా వీస్తున్నాయి. నీటి తడులు అందించిన వెంటనే భూమి తడంతా ఆడిపోతుంది. వెంటవెంటనే నీటి తడులను అందించాల్సి వస్తోంది. ఇప్పటికే బోర్లలో కొద్దికొద్దిగా నీరు తగ్గుతుంది. వర్షాలు రాకుండా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బోర్లలో నీరు తగ్గిపోయే ప్రమాద ఉంది. దీంతో ఆందోళనగా ఉంది.
– మునగల వెంకట్రామిరెడ్డి, రైతు, ఆక్కివారిపల్లె, కలసపాడు మండలం.
ఇప్పటికీ జిల్లాలో సరైన వర్షాలు కురవలేదు. ఖరీప్ సీజన్ ప్రారంభమైనా జూన్, జులై రెండు నెలలకు సంబంధించి కూడా లోటు వర్షపాతమే నమోదైంది. ఆరుతడి కింద సాగు చేసిన పంటలు ఎండిపోతాయేమోననే ఆందోళనలో రైతన్నలు ఉన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కరువు సహాయ చర్యలు తీసుకోవడంతోపాటు కరువు జిల్లాకు కడపజిల్లాను ప్రకటించాలి.
– దస్తగిరెడ్డి,
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి


