శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం

Aug 2 2026 1:10 AM | Updated on Aug 2 2026 1:10 AM

ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్‌లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు మూల విరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ ఆలయ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు..పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి, గర్భాలయంలోని మూలవిరాట్‌కి సమర్పించారు. పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు మూలవిరాట్‌కు తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు.

అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement