వినూత్న ఆవిష్కరణలకు వేదిక ‘స్టార్టప్‌ కడప’! | - | Sakshi
Sakshi News home page

వినూత్న ఆవిష్కరణలకు వేదిక ‘స్టార్టప్‌ కడప’!

Jul 31 2026 1:39 AM | Updated on Jul 31 2026 1:39 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : సరికొత్త ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలకు వేదికగా జిల్లా యువతను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపుదిద్దుకుంటున్న ‘స్టార్ట్‌ అప్‌ కడప’ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సెంటర్‌ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోందని కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. గురువారం సబ్‌ కలెక్టర్‌ హెచ్‌ఎస్‌ భావనతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. కడపను పారిశ్రామిక అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

నేడే పంటల బీమాకు చివరి గడువు

కడప అర్బన్‌: వాతావరణ ఆధారిత పంటల బీమా, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎఫ్‌బీవై)ల కింద పంటల నమోదుకు జులై 31తో గడువు ముగుస్తుందని కలెక్టర్‌ శ్రీధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పసుపు, మినుము, కంది తదితర పంటలను సాగు చేస్తున్న రైతులు చివరి అవకాశంగా భావించి వెంటనే బీమా చేయించుకోవాలని సూచించారు.

కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement