ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బుధవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 9:30 నుంచి సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని రాతి కల్యాణ మండపంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆశీనులు చేసి, నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం అర్చకులు వీణా రాఘవాచార్యులు, వీణా మనోజ్ కుమార్‌లు వైభవంగా పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకులు రెండు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ టీటీడీ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


