పెండ్లిమర్రి : పోలీసులు తనను అకారణంగా కొట్టారని మన స్థాపం చెందిన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లె గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... వేల్పుల గోపాల్, శ్రీను, ప్రతాప్, నాగార్జనలకు, వేల్పుల గంగరాజు, గంగయ్యల మద్య భూసమస్య ఉండేంది. ఇద్దరు గొడవ పడుతున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడి వెళ్లారు. వేల్పుల గంగరాజుకు పోలీసులు న్యాయం చేయకుండా అకారణంగా కొట్టారని మనస్థాపానికి గురై సమీపంలోని పొలాలల్లోకి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్మించాడు. కుటుంబ సభ్యులు గమనించి కడప రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్‌ఐ తులసి నాగప్రసాద్‌ను వివరణ కోరగా పోలీసులు ఎవరు అతనిని కొట్టలేదని పోలీసులను బయపెట్టాడానికి ఇలా చేశాడన్నారు.


