ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి

Jul 30 2026 4:36 AM | Updated on Jul 30 2026 4:36 AM

ఒంటిమిట్ట : ఒంటిమిట్టలో ఊరేసుకొని ఆత్మహత్యకు యత్నించిన పెద్దపల్లి సురేఖ(38) అనే వివాహిత చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు..మంగళవారం పెద్దపల్లి సురేఖ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. గమనించిన బంధువులు, స్థానికులు కొన ప్రాణాలతో ఉన్న సురేఖ ను ప్రైవేటు వాహనంలో కడప రిమ్స్‌ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి పిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. వివాహిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

రిమ్స్‌ మార్చురీలో

మహిళ మృతదేహం

కడప అర్బన్‌ : కడప నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)లో ఈనెల 27వ తేదీన గుర్తుతెలియని మహిళ (55) అనారోగ్యంతో చేరింది. ఆసుపత్రిలో చేరిన కొంతసేపటికి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలనీ రిమ్స్‌ అధికారులు కోరారు.

టీటీడీ మాజీ సభ్యులు

నవనీశ్వర్‌రెడ్డి మృతి

కడప కార్పొరేషన్‌ : తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యులు ముండ్ల నవనీశ్వర్‌రెడ్డి(85) మంగళవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన చెన్నూరు మండలం ముండ్లపల్లెలోని ఆయన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడైన ఆయన అప్పట్లో టీటీడీ బోర్డు మెంబర్‌గా పనిచేశారు. బుధవారం ఆయన అంత్యక్రియలు ముండ్లపల్లెలో నిర్వహించారు. నవనీశ్వర్‌రెడ్డి మృతి పట్ల కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, సీఈసీ సభ్యులు కె.సురేష్‌ బాబు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలు వెల కట్టలేనివని కొనియాడుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విధులకు ఆటంకం

కలిగిస్తున్నారని ఫిర్యాదు

కడప అర్బన్‌ : కొండాపురం మండలంలోని వెంక య్య కాలువ గ్రామం అంగన్‌వాడీ కేంద్రంలోనికి ఎ ల్లాల రామకృష్ణ, సురేష్‌, సంజీవ్‌, పత్తికొండ సుబ్బరాయుడులు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ కార్యకర్త నందిని విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆమె కుటుంబాన్ని అంతమొందిస్తామని బెదిరించారని వారిపై చర్యలు తీసుకోవాలని బుధవారం ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేసినట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసి.బాదుల్లా తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్ష్యగట్టి విధులు నిర్వహిస్తున్న నందిని దూషిస్తూ బయటికి నెట్టివేసి కేంద్రానికి తాళం వేయడం దారుణం అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్త ఫోన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయగా కొండాపురం పోలీసులు వచ్చి పోయారే తప్ప చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

చౌడేపల్లె : చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చౌడేపల్లె మండలం చిన్న యల్లకుంట్ల సమీపంలోని బసమ్మ చింతతోపులో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కుమ్మరవీధికి చెందిన వి.గంగాధర్‌ (42) రెండు నెలలుగా అనారోగ్యానికి గురై పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఈ క్రమంలో మంగళవారం కడుపునొప్పి అధికం కావడంతో ఇంటి నుంచి బైక్‌పై వెళ్లారు. ఎంత సేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గాలించినా ఆచూకీ తెలియరాలేదు. బుధవారం ఉదయం పుంగనూరు మార్గంలోని చిన్నయల్లకుంట్ల సమీపంలోని చింతతోపు చెట్టుకు ఉరివేసుకుని ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement