ఈపీఎఫ్‌పై విశ్వవిద్యాలయ ప్రతినిధులకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్‌పై విశ్వవిద్యాలయ ప్రతినిధులకు అవగాహన

Jul 30 2026 4:36 AM | Updated on Jul 30 2026 4:36 AM

కడప ఎడ్యుకేషన్‌ : అర్హులైన ఉద్యోగులకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎఫ్‌) కట్టడం లేదనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో బుధవారం కడప ఈపీఎఫ్‌ఓ కార్యాలయంలో ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌–1 రవితేజకుమార్‌రెడ్డి, ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డి–2లు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన విశ్వవిద్యాలయ ప్రతినిధులకు పీఎఫ్‌ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కడప యోగివేమన విశ్వ విద్యాలయ(కడప), విక్రమ సింహపురి విశ్వ విద్యాలయం(నెల్లూరు) అబ్థుల్‌ హక్‌ ఉర్దూ విశ్వ విద్యాలయం(కర్నూల్‌), కేంద్రీయ విశ్వ విద్యాలయం(అనంతపురం) ఇండియన్‌ ఇనిస్ట్యూషన్‌ ఆప్‌ ఇన్మర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అడ్‌ మ్యానిమ్యాక్చరింగ్‌(ఐఐఐటీడీఎం, కర్నూల్‌) ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ విశ్వ విద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ వర్తించే విషయంలో వివిధ అంశాలను వివరించారు. భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ పరిధిలోని ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అర్గనైజేషన్‌ ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగుల నమోదు పథకం పొడగించిందని దీని ద్వారా యజమానులు ప్రావిడెంట్‌ ఫండ్‌ ఫరిధిలోకి రాకుండా మిగిలి పోయిన ఆర్హులైన ఉద్యోగులను స్వచ్ఛందంగా ప్రకటించి నమోదు చేయడానికి మరో అవకాశం లబిచిందని తెలిపారు. ఈ ప్రచారం 2009 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2026 మార్చి 31 మద్య కాలానికి వర్తింస్తుందన్నారు. ఈ పథకం 2026 ఆక్టోబర్‌ 31తో ముగిస్తుందన్నారు. కడప ప్రాంతీయ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న యజమానులు ఈ అవకాశాన్ని సద్వివనియోగం చేసుకోవాలని తెలిపారు. అర్హులైన ఏ ఉద్యోగి సామాజిక భద్రతా వలయం వెలుపల ఉండకుండా చూసుకోవాలని విజ్ఞపి చేశారు. సంస్థల ప్రస్తుత ఈపీఎఫ్‌ కవరేజ్‌ స్థితితో సంబంధం లేకుండా ఈ పథకం అన్ని సంస్థలకు సమానంగా వర్థిస్తుందన్నారు. ఇప్పటికే ఈపీఎఫ్‌ఓలో నమోదైన సంస్థలతోపాటు మొదటిసారిగా చట్టం పరిధిలోకి వచ్చే కొత్త సస్థలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఈ పథకం ప్రకారం ఒకవేళ ఉద్యోగి వేతనం నుంచి ముందుగానే మినహాయించబడకపోతే గత కాలానికి సంబంధించిన ప్రావిడెంట్‌ పండ్‌ చందాలో ఉద్యోగి వాటా మాపీ చేయబడుతుందన్నారు. యజమానులు కేవలం తమ వాటా చంద, వర్తించే వడ్డి, అ డ్మినిస్ట్రేటివ్‌ చార్జీలు, మరియు ఒక్కొ సంస్థకు రూ.100 నామమాత్రపు ఏకమొత్తం జరిమానా చెల్లిస్తే సరిపోతుందన్నారు. కార్యక్రమంలో పలు యూనివర్సీటీ ప్ర తినిధులు, పీఎఫ్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement