ఆర్టీపీపీ భద్రత పహారా కోసం బైక్‌ల వితరణ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీపీపీ భద్రత పహారా కోసం బైక్‌ల వితరణ

Jul 29 2026 1:46 AM | Updated on Jul 29 2026 1:46 AM

ఎర్రగుంట్ల : డాక్టర్‌ ఎంవీఆర్‌ రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో భద్రతలో భాగంగా పహారా కోసం యూనియన్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో రెండు బైక్‌లను వితరణ చేసినట్లు ఆ బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ ఎ.లక్ష్మీతులసి తెలిపారు. మంగళవారం ఈ రెండు నూతన బైక్‌లను ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు బైక్‌లు ఆర్టీపీపీలో, కాలనీలో భద్రతా ఏర్పాట్లు మెరుగు పరిచేందుకు చాలా ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ లక్ష్మీతులసిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ సోమశేఖర్‌రెడ్డి, ఇతర ఎస్‌ఈలు, జీఎం, ఫ్యాక్టరీ మేనేజర్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌, డీఎఫ్‌ఓ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉజ్వల భవిష్యత్తుకు ప్రణాళిక అవసరం

కడప ఎడ్యుకేషన్‌ : ఉజ్వల భవిష్యత్తుకు స్పష్టమైన లక్ష్యం, ప్రణాళిక అవసరమని జిల్లా ఉపాధి అధికారి ఎ.సురేష్‌ కుమార్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, యోగి వేమన విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం యూనిట్‌–9 సంయుక్త ఆధ్వర్యంలో ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, స్వయం ఉపాధి, స్టార్టప్‌లపై కెరీర్‌ అవగాహన సదస్స్ఙు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి, స్టార్టప్‌లు, విదేశీ ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement