– పీజీఆర్‌ఎస్‌లో అంధ ఉపాధ్యాయుడు ఫిర్యాదు
కడప ఎడ్యుకేషన్: పొద్దుటూరులోని ఎస్‌వీవీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అంధ ఉపాధ్యాయుడు చిన్న పుల్లయ్య తమ పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎంతోపాటు మరో ఉపాధ్యాయుడు కలిసి మానసికంగా వేధిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై సోమవారం కడప పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు వారిపై ఫిర్యాదు చేశారు. పదోతరగతిలో కొందరు పిల్లలతో నా బోధన సరిగా లేదని పేపర్‌లో రాయించడమే కాకుండా పిల్లల తల్లితండ్రులతో ఇటీవల జరిగిన మెగా పీటీఎం సభలో అందరి సమక్షంలో నా గురించి చెడుగా చెప్పిమని ప్రొత్సహించారని,కొందరు తల్లితండ్రుల సభలో మాట్లాడారని తెలిపారు. ఈ విధంగా ఆ ఇద్దరు ఉపాధ్యాయులు అంధ ఉపాధ్యాయుడనని చూడకుండా పరోక్షంగా మానసిక వేదనకు కారణం అయ్యారని తెలిపారు. విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మహిళ ఆత్మహత్య కేసులో వ్యక్తి అరెస్ట్
పులివెందుల రూరల్ : పట్టణంలోని జేఎన్టీయూ కళాశాల క్వార్టర్స్‌లో 2025 నవంబర్ నెలలో హైదరాబాద్‌కు చెందిన పర్వీన్ అనే మహిళ పులివెందులలోని తన అక్క ఇంటికి వచ్చి ఫ్యాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో పర్వీన్ భర్త టిప్పుసుల్తాన్‌ను పోలీసులు సోమవారం ముద్దనూరు రోడ్డులోని గాంధీ సర్కిల్‌లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టుకు హాజరు పరిచి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
చెట్టును ఢీకొన్న బైక్ : యువకుడు మృతి
రాజుపాళెం : మండల కేంద్రమైన రాజుపాళెం నుంచి కొర్రపాడు గ్రామానికి వెళ్లే రహదారిలో రాజుపాళెం సబ్ స్టేషన్‌కు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జోగి వెంకట సాయి (19) అనే యువకుడు మృతి చెందాడు.. ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు టౌన్‌లోని సున్నంబట్టి వీధికి చెందిన జోగి వెంకట సాయి, నల్లబోతుల భరత్‌కుమార్‌లు ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంలో నంద్యాల జిల్లా చాగలమర్రి నుంచి ప్రొద్దుటూరుకు వెళుతుండగా రాజుపాళెం సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది.బైక్ నడుపుతున్న వెంకట సాయి తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. భరత్ కుమార్‌కు గాయాలైనట్లు తెలిపారు. భరత్ కుమార్ పిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించాడు.


