ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

Jul 28 2026 1:42 AM | Updated on Jul 28 2026 1:42 AM

ముద్దనూరు: నిర్మాణంలో వున్న ముద్దనూరు–పులివెందుల జాతీయ రహదారిలో సోమవారం బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయా లయ్యాయి.చిన్నదుద్యాల గ్రామ సమీపంలోజరిగిన ఈ ప్రమాదంలో ఆధార్‌కార్డు ఆధారంగా పులివెందులకుచెందిన సుబ్బరాయుడు అనే వ్యక్తి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు.సుబ్బరాయుడు రహదారి పక్కనే పడిపోయివుండడంతో అతనిని 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కారు ఢీకొని..

మైదుకూరు : మైదుకూరు శివారులో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖాజీపేట మండలం ముత్తులూరుపాడు గ్రామానికి చెందిన డి.ఓబులేసు అనే వ్యక్తి గాయపడ్డాడు. ఓబులేసు బైక్‌పై వస్తుండగా స్థానిక బాలశివయోగి డిగ్రీ కాలేజీ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో అతనికి గాయాలయ్యాయి. చికిత్స కోసం మైదుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అతన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి రెఫర్‌ చేశారు.

ఆ గ్రామాలకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

ఒంటిమిట్ట: మండల పరిధిలోని మంటపంపల్లి ఫీడర్‌ పరిధిలోని 5 గ్రామాలకు మంగళవారం నుంచి 10 రోజుల పాటు విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఒంటిమిట్ట విద్యుత్‌ శాఖ ఏఈ సి. జయకేశవరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిస్టిబ్యుషన్‌ సెక్టార్‌ స్కీం పనుల్లో భాగంగా నరవకాటిపల్లి, సాలాబాదు ఫీడర్‌ పరిధిలోని నరవకాటిపల్లి, బోగేపల్లి, చెర్లోపల్లి, నడింపల్లి, పోలిబుచ్చయ్యగారిపల్లి గ్రామాలకు 10 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విద్యుత్‌ అంతరాయం ఉంటుందన్నారు. అలాగే వ్యవసాయ సంబంధిత 3–ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా అందించడంలో ఉదయం 4 నుంచి 10 గంటల వరకు, రాత్రి 9 నుంచి 12 గంటల వరకు మార్పులు చేసినట్లు తెలిపారు. ప్రజలు గమనించి విద్యుత్‌ శాఖ కు సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement