● భవనాలున్నా.. భాగ్యం లేదు ! | - | Sakshi
Sakshi News home page

● భవనాలున్నా.. భాగ్యం లేదు !

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

త వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ‘నాడు–నేడు’ పథకం కింద నల్లపురెడ్డిపల్లె పాఠశాల రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా అత్యంత సుందరమైన భవనాలు, క్లాస్‌ రూమ్‌లను ఇక్కడ నిర్మించారు. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థపై పర్యవేక్షణ లోపించింది. పాఠశాలలో చదువుకోవడానికి అన్ని వసతులతో కూడిన డిజిటల్‌ గదులు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులను తరగతి గదుల లోపల కూర్చోబెట్టడం లేదు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా పిల్లలను బయటకు తెచ్చి.. మైదానంలో, చెట్ల కింద నేలపై కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. సుందరమైన విద్యా మందిరాలు కళ్లముందున్నా, వాటిని నిరుపయోగంగా మార్చేసి విద్యార్థులను ఇలా ఆరుబయట ఎండలో కూర్చోబెట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికై నా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, నల్లపురెడ్డిపల్లె స్కూల్‌లో విద్యార్థులకు క్లాస్‌ రూమ్‌లలోనే సక్రమంగా డిజిటల్‌ విద్య అందేలా చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై విచారణ జరిపించాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు.

– పులివెందుల రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement