పాము కాటుకు గురైన విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

పాము కాటుకు గురైన విద్యార్థి

Jul 24 2026 2:09 AM | Updated on Jul 24 2026 2:09 AM

కలసపాడు : మండలంలోని గంగాయపల్లెకు చెందిన సుంకరిమధు అనే విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గురువారం ఉదయం గడ్డివామి వద్దకు వెళ్లి గడ్డి తీస్తుండగా పాము విద్యార్థిని కాటు వేసింది. వెంటనే స్థానికులు గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ మధు చికిత్స పొందుతున్నాడు. విద్యార్థి ఎగువ రామాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. మధు తండ్రి 5 సంవత్సరాల క్రితం మృతిచెందాడు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

పుల్లివీడు వీఆర్‌ఓ సస్పెన్షన్‌

పోరుమామిళ్ల : పుల్లివీడు వీఆర్‌ఓ సునీతను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పుల్లివీడు పంచాయతీలోని బొప్పాపురానికి చెందిన గోవిందాయపల్లె వినయ్‌కుమార్‌ తన అత్త పేరు మీద ఉన్న పొలం ఆమె కూతురు పేరు మీదకు మార్చాలని వీ ఆర్‌ఓను కోరగా ఆమె రెండు లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు. దీంతో పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్‌కు పంపి, న్యాయం చేయాలని వినయ్‌కుమార్‌ కోరారు. స్పందించిన కలెక్టర్‌ తహసీల్దారు విజయ్‌కుమార్‌ను దీనిపై విచారించాలని ఆదేశించారు. తహసీల్దారు విచారించి ఆరోపణలు వాస్తవమేనని ఆర్డీఓకు నివేదిక ఇవ్వడంతో కలెక్టర్‌ ఆమెను సస్పెండ్‌ చేశారు.

డిస్మిస్‌ చేయాలి : మధుబాబు

లంచగొండి వీఆర్‌ఓలను సస్పెండ్‌ చేస్తే సరిపోదని, డిస్మిస్‌ చేయాలని నేషనల్‌ హ్యూమన్‌రైట్స్‌ ఉపాధ్యక్షులు కవలకుంట్ల మధుబాబు కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ కన్నతల్లి చనిపోతే ఆమె కున్న ఏకై క కూతురు భూమిని తన పేరుకు మార్చాలని, మ్యుటేషన్‌ చేయాలని కోరగా వీఆర్‌ఓ సునీత రూ. 2 లక్షలు డిమాండ్‌ చేయడం దుర్మార్గమన్నారు. ఆమైపె గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయని, ఆమె ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు చేయాలని కోరారు.

ఇద్దరు యువకులపై

పోక్సో కేసు

కడప అర్బన్‌ : కడప టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బాలిక పట్ల, వెంకట్‌, చిన్న అనే ఇద్దరు యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వీరిపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి పోక్సో యాక్ట్‌ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నట్లు సమాచారం.

నేటి నుంచి ఐటీఐలలో అడ్మిషన్లు

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలలో 2026–27, 2027–28 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల పక్రియ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని ఐటీఐ జిల్లా కన్వీనర్‌ జ్ఞానకుమార్‌ తెలిపారు. 10వ తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌, ఇంటర్‌ పాస్‌ లేదా ఫెయిల్‌తోపాటు 14 సంవత్సరాలు నిండిన విద్యార్థులు అడ్మిషన్లకు అర్హులని తెలిపారు. అభ్యర్థులు తమ 10వ తరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం, టీసీ, ఆధార్‌కార్డు, ఫొటో, మెయిల్‌ ఐతీతోపాటు పర్మినెంట్‌గా ఉపయోగించే మొబైల్‌ ఫోన్‌ నంబర్‌తో దగ్గరలోని ఐటీఐల వద్దకు వెళ్లి itiadmissions.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. అడ్మిషన్లకు ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement