విద్యార్థిని అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అదృశ్యం

Jul 24 2026 2:03 AM | Updated on Jul 24 2026 2:03 AM

పోరుమామిళ్ల : కాలేజీకి పోతున్నా అంటూ బుధవారం ఇంటి నుంచి వెళ్లిన తన కూతురు హరిత (17) ఇంతవరకు తిరిగి రాలేదని ఆమె తల్లి తులసి గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని ఎస్‌ఐ హనుమంతు తెలిపారు. దీనిపై మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆమెను గుర్తించిన వారు తమకు తెలియజేయాలని కోరారు. తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

రాయితో కొడుకుపై

దాడి చేసిన తండ్రి

కలసపాడు : మండలంలోని ముద్దంవారిపల్లె గ్రామానికి చెందిన సగిలిఫ్రాన్సిస్‌ తన కుమారుడు సగిలిసర్వేష్‌ను రాయితో తలపై కొట్టడంతో గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే సర్వేష్‌ కడపలోని నాగరాజు హైస్కూల్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సర్వేష్‌ తన భార్యను కడపకు తీసుకెళ్లి అక్కడే కాపురం పెట్టాలని చెప్పాడు. ఈ విషయమై తండ్రి ఫ్రాన్సిస్‌, సర్వేష్‌కు వాగ్వాదం జరిగింది. వాగ్వాదం తీవ్ర రూపం దాల్చగా ఫ్రాన్సిస్‌ సమీపంలో ఉన్న రాయితో సర్వేష్‌ తలపై కొట్టడంతో అతనికి రక్తగాయాలయ్యాయి. అతను ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని అనంతరం కలసపాడు పోలీసుస్టేషన్‌కు వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఫ్రాన్సిస్‌ తన కోడలు వేలాంగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో తండ్రీకొడుకుల మధ్య గత కొంతకాలంగా విబేధాలు కొనసాగుతున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement