పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం | - | Sakshi
Sakshi News home page

పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం

Jul 24 2026 2:03 AM | Updated on Jul 24 2026 2:03 AM

సిద్దవటం : పోలీసులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమని కర్నూలు రేంజ్‌ బెటాలియన్‌ డీఐజీ–2 ఉదయభాస్కర్‌ అన్నారు. మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. బెటాలియన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను, చిన్న పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్మించనున్న నూతన షెడ్‌ ఏర్పాటుకు సంబంధించిన శిలాఫలకాలను డీఐజీ చేతుల మీదుగా ఆవిష్కరించి ప్రారంభించారు. బెటాలియన్‌లో మహిళల కోసం నిర్వహిస్తున్న ఉచిత టైలరింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సును ఆయన సతీమణి చేతుల మీదుగా ప్రారంభింపచేశారు.

అనంతరం బెటాలియన్‌లోని ఆఫీసులు, స్టోర్లు, యూనిట్‌ హాస్పిటల్‌, ఆయుధాగారం తదితర విభాగాలను తనిఖీ చేశారు.కార్యక్రమంలో కమాండెంట్‌ ఆనందరెడ్డి, అసిస్టెంట్‌ కమాండెంట్లు పిఎన్‌డి ప్రసాద్‌, రాజశేఖర్‌, వెంకటప్ప, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, బెటాలియన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement