గతంలో ఎలక్ట్రికల్ వ్యాపారాలు బాగా జరిగేవి. ఇప్పుడు ఆశించినంతగా లేవు. నిర్మాణ రంగం పూర్తిగా పడిపోయింది. కొన్ని నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ కారణంగా మా వ్యాపారాలు తగ్గిపోయాయి. అంతేగాక ప్రజల వద్ద డబ్బు రొటేషన్ లేదు. ఆన్‌లైన్ అమ్మకాలు కూడా మా వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయి. అరకొర వ్యాపారాలు జరిగినా పెట్టుబడికి తగినట్టు లాభాలు ఉండటం లేదు. ఎలాగో అలాగా బండిని నడిపిస్తున్నాం.
– శ్రీనివాసులు, శ్రీనివాస ఎలక్ట్రికల్స్,
వెదుర్లబజార్, ప్రొద్దుటూరు


