26న దివ్యాంగుల క్రికెట్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

26న దివ్యాంగుల క్రికెట్‌ ఎంపికలు

Jul 23 2026 12:48 AM | Updated on Jul 23 2026 12:48 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: అమరావతి ఇన్‌క్లూజివ్‌ క్రికెట్‌ కప్‌–2026 పోటీల్లో పాల్గొనే ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా శారీరక దివ్యాంగుల క్రికెట్‌ జట్టు ఎంపికలు ఈ నెల 26న కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ స్టేడియం నెట్స్‌లో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా అసోసియేషన్‌ కన్వీనర్‌ మనోహర్‌రాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన క్రీడాకారులు తమ సొంత క్రికెట్‌ కిట్‌తో పాటు ఆధార్‌ కార్డు, సదరం సర్టిఫికేట్‌, యూడీఐడీ కార్డు జిరాక్స్‌ ప్రతులు మరియు రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలతో హాజరుకావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9885254432 లేదా 9160008447 నంబర్లను సంప్రదించవచ్చు.

కోవిడ్‌ నియంత్రణకు చర్యలు

కడప రూరల్‌: కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ యుగంధర్‌ అన్నారు. ఆయన బుధవారం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని సందర్శించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌తో చర్చించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

వేంపల్లె : ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి హరిప్రసాద్‌ ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ఉషశ్రీ తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయస్థాయి క్రీడాలకు ఎంపికై న హరి ప్రసాద్‌ను ఫిజికల్‌ డైరెక్టర్‌ తేజేంద్రతో కలిసి అభినందించారు. ఈనెల 24 నుంచి 26 వరకు జమ్ము తావి, జమ్ము కశ్మీర్‌లో జాతీయ స్థాయిలో జరిగే బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు ఏపీ తరపున హరిప్రసాద్‌ పాల్గొంటారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement