గురువులను దర్శించుకోవడం ఆనందదాయకం | - | Sakshi
Sakshi News home page

గురువులను దర్శించుకోవడం ఆనందదాయకం

Jul 23 2026 12:48 AM | Updated on Jul 23 2026 12:48 AM

కడప సిటీ: కడప అమీన్‌పీర్‌ దర్గా గురువులను తొలిసారి దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతను ఇచ్చిందని ప్రముఖ సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ తెలిపారు. బుధవారం దర్గాకు విచ్చేసిన ఆయనకు ముజావర్‌ సంప్రదాయబద్ధంగా తలపాగా చుట్టి స్వాగతం పలికారు. దర్గాలోని ప్రధాన గురువు హజరత్‌ పీరుల్లామాలిక్‌తో పాటు ఇతర గురువుల మజార్లను దర్శించుకున్న హీరో.. చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ప్రతినిధులు ఆయనకు ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం దర్గా ఆవరణలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’ షూటింగ్‌ ప్రస్తుతం ప్రొద్దుటూరులో కొనసాగుతోందని, అంతకుముందు గండికోటలో కూడా షూటింగ్‌ జరిగిందని తెలిపారు. ప్రేక్షకులంతా తన ‘హైందవ’ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. కాగా, హీరో రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో దర్గాకు చేరుకుని హీరోతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement