కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లాలోని మద్యం బెల్ట్ షాపులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు అధికారులకు సూచించారు. బుధవారం నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల ప్రొహిబిషన్ – ఎక్సైజ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్రమంగా తయారు చేసే నాటుసార, సుంకం చెల్లించని మద్యం, బెల్ట్ షాపుల నిర్మూలనపై చేపట్టిన చర్యలు, నమోదైన కేసులు, భవిష్యత్ కార్యాచరణతో పాటు ఎకై ్సజ్ ఆదాయం లక్ష్యాల సాధనపై సమగ్రంగా సమీక్షించారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతర తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, సూపరింటెండెంట జె.రమేష్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.


