టీడీపీనేత మహేశ్‌నాయుడు, అనుచరుల ఓవరాక్షన్‌! | - | Sakshi
Sakshi News home page

టీడీపీనేత మహేశ్‌నాయుడు, అనుచరుల ఓవరాక్షన్‌!

Jul 23 2026 12:48 AM | Updated on Jul 23 2026 12:48 AM

టాస్క్‌ఫోర్స్‌ : సుండుపల్లె–సానిపాయ మార్గ మధ్యలో ఉప్పరపల్లె వద్ద ఇసుక టిప్పర్‌ ఢీ కొనడంతో మృతి చెందిన గొర్రెల పెంపకందార్లు జయరామ, రవీంద్ర కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు, కుటుబీకులు ఆందోళన చేపట్టారు. ప్రమాదం సమాచారం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి సంఘటన స్ధలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో బైఠాయించారు.

టీడీపీకి ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని..

ఇసుక టిప్పర్‌ కిందపడి ఇద్దరు మృతి సంఘటనలో టీడీపీ ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డపేరు వస్తుందనే భావనతో గతంలో పలు ఎర్రచందం స్మగ్లింగ్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న మహేష్‌నాయుడు, ఆయన అనచరులు ఆందోళనకు అడ్డంగా నిలిచారు. ధర్నాలు చేయవద్దంటూ, బైఠాయించిన వారు లేచిపోవాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మర్నాడు మళ్లీ ధర్నా చేస్తామని, మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆగేది లేదన్నారు. ఇసుకరీచ్‌లో ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. కాగా మహేశ్‌నాయుడు ఓవరాక్షన్‌ చూసిన స్థానికులు నివ్వెరపోయారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలని ఎమ్మెల్యే బైఠాయించి,ఆందోళన చేస్తుంటే, మహేశ్‌నాయుడు, వారి అనుచరులు వీరంగంపై పలువురు విమర్శిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసిన క్రమంలో సుండుపల్లె ఎస్‌ఐ మహేశ్‌ రంగప్రవేశం చేసి ఈ కేసు విషయంలో పూర్తిస్ధాయి విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. మహేశ్‌నాయుడు ఓవరాక్షన్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజెన్లు మృతుల కుటుంబాలకు అండగా నిలవాల్సిందిపోయి, ధర్నా చేయొద్దు అంటూ అరచడం చూసి నె పెదవి విరిస్తున్నారు. ఈ ప్రమాదం విషయంలో టీడీపీ అభాసుపాలు కావడానికి మహేష్‌ నాయుడు వైఖరే కారణమని విమర్శలు వెలువడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement