నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయిక్రిష్ణ, సునీల్‌కుమార్, పాంచరాత్ర ఆగమ పండితులు మనోజ్, పవన్, పార్థసారథి, రంగనాధాచార్యులు, వేదపారాయణం, సంతోష కృష్ణశర్మ, లావణ్య రామశర్మల ఆధ్వర్యంలో గజ స్తంభంపై గరుడ చిహ్నంతో ఉండే పతాకాన్ని ఎగరవేసి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.రాత్రి యాలివాహనంపై శ్రీసౌమ్యనాథుడు శ్రీదేవి భూదేవితో కలిసి పురవీధుల్లో ఊరేగుతూ భక్తజన కోటికి దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఏఈఓ ఎన్.రవి, డిప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం పల్లకీసేవ, తిరుమంజనం రాత్రికి హంస వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.


