పెద్దముడియం(జమ్మలమడుగు) : పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పెద్దముడియం మండలం మేడిదిన్నె గ్రామానికి చెందిన కొమ్మ ఓబులేసు ఇటీవల మృతి చెందాడు. ఇతని మృతిపై అనుమానాలు ఉన్నాయని ఎమ్మార్పీఎస్ నాయకుడు చిన్నయ్య మాదిగ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఆర్డీఓ నొస్సం పోలీసులకు రెఫర్ చేశారు.దీంతో సంజామల మండలంలోని పోలీసులను దళిత సంఘాల నాయకులు కలిశారు. ఈసందర్భంగా కొమ్మ ఓబులేసుకు మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ నొస్సంలోని ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించాడు. సూది వేయించుకుని ఓబులేసు తిరిగి గ్రామానికి వచ్చాడు. రాగానే వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడి శరీరంపై బొబ్బలు వచ్చాయి. సూది వేసిన నాలుగు గంటలలోపే ఓబులేసు మృతిచెందాడు. ఇది తెలియని బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. 4 రోజుల తర్వాత ఫొటోల్లో శరీరంపై ఉన్న బొబ్బలను గుర్తించిన కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆర్‌ఎంపీ వైద్యుడు వేసిన సూది మందు వికటించడంతోనే ఇలా జరిగిందని భావించి పోస్టుమార్టం నిర్వహిస్తే అసలు విషయం బయటపడుతుందని ఆర్డీఓను కలిశారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు బుధవారం మేడిదిన్నె గ్రామంలో పూడ్చిపెట్టిన శవానికి ఆళ్లగడ్డకు చెందిన ప్రభుత్వాసుపత్రి వైడ్యుడు.. పెద్దముడియం తహసీల్దార్ బాల నరసింహులు, సంజామల ఎస్‌ఐ రమణయ్యల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.


