బాలిక అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

బాలిక అదృశ్యం

Jul 21 2026 12:23 AM | Updated on Jul 21 2026 12:23 AM

పోరుమామిళ్ల: మండలంలోని పుల్లివీడుకు చెందిన పడమటి హజీరా(17) ఈ నెల 16న సాయంత్రం ఇంటి నుండి వెళ్లిపోయింది.ఎవరికీ చెప్పకుండా వెళ్లిందని, మూడు రోజులైన ఆచూకీ లభించలేదని బాలిక తండ్రి మహబూబ్‌బాషా ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హనుమంతు సోమవారం తెలిపారు.

రేషన్‌ బియ్యం స్వాధీనం

సిద్దవటం : మండలంలోని మాచుపల్లి దర్గా సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ హారిక తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ మండలంలోని టక్కోలు గ్రామానికి చెందిన కొత్త ఆ టోలో అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తు న్నారని తనకు సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి దాడులు చేశామన్నారు. రేషన్‌ బియ్యం తరలిస్తున్న ఆటోను స్వాధీనం చేసుకుని, ఆటో డ్రైవర్‌ హనుమత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆటోను పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. మొత్తం ఆరు బస్తాల బియ్యం, 300 కిలోలు ఉంటాయన్నారు. ఈ మేరకు విచారించి కేసు నమోదు చేస్తామన్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీ

– వ్యక్తికి తీవ్ర గాయాలు

సిద్దవటం : మండలంలోని జేఎంజే కళాశాలకు సమీపంలో ఉన్న కోతుల మోరి మలుపు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మాధవరం–1 గ్రామానికి చెందిన జయకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ హారిక తెలిపిన వివరాల మేరకు.. సిద్దవటం మండలం మాధవరం–1 గ్రామానికి చెందిన జయకృష్ణ సోమవారం తెల్లవారుజామున కడప నుంచి కారులో స్వగ్రామానికి బయలుదేరాడు. రాజంపేట నుంచి గుర్తు తెలియని వాహనం కోతులమూరి మలుపు వద్ద కారును ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న జయకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే పెట్రోలింగ్‌ పోలీసులు, జేఎంజే కళాశాల వద్ద ఉన్న చెక్‌పోస్టు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని జయకృష్ణను 108 వాహనంలో కడప రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆగి ఉన్నలారీని ఢీ కొట్టిన మరో లారీ

కొండాపురం: మండల పరిధిలోని పెంజి అనంతపురం సర్కిల్‌ వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ హరికృష్ణకు తీవ్రగాయలయ్యాయని కొండాపురం ఎస్‌ఐ జయరాములు సోమవారం తెలిపారు. ఈఘటనలో లారీ క్యాబిన్‌లో హరికృష్ణ ఇరుక్కుపోయాడు. స్థానికులు పోలీసుల సహాయంతో అతన్ని బయటకు తీశారు. క్షతగాత్రున్ని 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement