కడప సెవెన్ రోడ్స్: నీట్ పేపర్ లీకేజీకి భాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వివిధ పార్టీలు, సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. డిల్లీలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్షకు కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. సోమవారం కడపలోని మహావీర్ సర్కిల్ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు డాక్టర్ రాజా వెంగల్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోమోహన్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్,ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి, వైయస్సార్ విద్యార్థి విభాగం అధ్యక్షులు సాయి దత్త, డివైఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరణాల శివ ఈ సందర్బంగా మాట్లాడారు. పేపర్ లీకేజీ వల్ల 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. ఇవన్ని కేంద్ర ప్రభుత్వ హత్యలే అని అన్నారు.


