ఖాజీపేట : వ్యవసాయపనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా లారీ ఢీ కొని రైతు మృతి చెందాడు. బాలానగర్ గ్రామానికి చెందిన పొన్నూరు జయరాజు (60) ఆదివారం ఉదయం కొత్తపేట వద్ద ఉన్న తన భూమి వద్ద కు వెళ్లి పనులు చూసుకుని బైక్‌లో ఇంటికి బయలుదేరాడు. కొత్త పేట కూడలిలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొంది. దీంతో జయరాజు కుప్పకూలాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు విషయం తెలియజేయగా వారు వచ్చి జయరాజను కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌ను ఖాజీపేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.


