నీట్‌గా మెరిశారు
జయసింహ సత్తా
బద్వేలు అర్బన్ : వైద్యవిద్య ప్రవేశ పరీక్ష ఫలితాల్లో పట్టణానికి చెందిన ప్రముఖ విద్యుత్‌శాఖ కాంట్రాక్టర్ కరెంటునరసారెడ్డి మనవడు మయుక్‌జయసింహ 720 మార్కులకు 700 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 42వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు వైద్యులుగా సేవలందిస్తున్నారు. విద్యార్థికి మానవత అధ్యక్షుడు నాగిరెడ్డిశంకర్‌రెడ్డి, పలువురు పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
వర్దన్‌రెడ్డి ప్రతిభ
జమ్మలమడుగు: ఇటీవల జరిగిన నీట్‌పరీక్షల్లో జమ్మలమడుగుకు చెందిన ఎంబీ వర్థన్‌రెడ్డి జాతీయస్థాయిలో 199వ ర్యాంకును సాధించాడు.తల్లిదండ్రులు ప్రసాద్‌రెడ్డి భాగ్యరేఖ ఆనందం వ్యక్తం చేశారు.తమ కుమారుడు వర్ధన్‌రెడ్డికినీట్ పరీక్షల్లో మొత్తం 720 మార్కులకు 685 మార్కులుసాధించాడని, జాతీయ స్థాయిలో 199ర్యాంకు, జనరల్‌కేటగిరిలో 139వ ర్యాంకు వచ్చిందని చెప్పారు. వర్దన్‌రెడ్డి పదిలో 575 మార్కులు పొందాడు. ఇంటర్ హైదరాబాద్‌లో మాధపూర్‌లోని ప్రైవేట్‌కాలేజీలో చదివాడు.అక్కడే చదవుకుంటూ షార్టు టైంలోనే నీట్‌పరీక్షలో ర్యాంకుసాధించినట్లు తెలిపారు.
మెరిసిన జ్యోతి
సిద్దవటం : సిద్దవటానికి చెందిన జ్యోతి కళానిధి నీట్–2026లో ప్రతిభ కనపరిచిన జనరల్ ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఆలిండియా ర్యాంకు 8350 సాధించింది. జ్యోతి కళానిధి చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో చదువులో రాణించేదని తల్లిదండ్రులు నరసింహారెడ్డి, శారద తెలిపారు. జ్యోతి శ్రీ భారతి హైస్కూల్‌లో పదో తరగతి చదివింది. హైస్కూల్ కరెస్పాండెంట్ డాక్టర్ ముక్కర వెంకటసుబ్బారెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థికి అభినందనలు తెలిపారు.
చక్రాయపేట మండల విద్యార్థిని ప్రతిభ
వేంపల్లె : నీట్ ఫలితాలలో చక్రాయపేట మండల విద్యార్థిని పొట్టి పాటి తేజస్విత ప్రతిభ కనబరిచింది. పదో తరగతి వేంపల్లె లో, విజయవాడలో ఇంటర్మీడియట్ చదివింది. నీట్ ఫలితాలలో ఆల్ ఇండియా 17100 ర్యాంకు సాధించింది. మెడిసిన్ చదివి పేద ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నదే లక్ష్యం అని తెలిపింది.తల్లిదండ్రులు కిషోర్ కుమార్ రెడ్డి, రుక్మిణి దేవి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల సహకారంతో మెడిసిన్‌లో కూడా మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు పేరు తీసుకొస్తానని తేజస్విత తెలిపింది,
వర్థన్‌రెడ్డి మయుక్‌జయసింహ జ్యోతి కళానిధి తేజస్విత


