ప్రభుత్వ విద్యపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తల్లికి వందనం ఇప్పటి వరకు ఇవ్వలేదు. విద్యాసామగ్రిని కూడా విద్యార్థులకు అరకొరగానే ఇచ్చారు. గత ప్రభుత్వంలో పాఠశాలలు తెరిచే రోజే తల్లిదండ్రుల ఖాతాలకు తల్లికి వందనం డబ్బుల పడేది. అలాగే బడి తెరిచిన రోజే విద్యార్థులకు విద్యా సామగ్రిని అందించేది. నేడు ఆ పరిస్థితి లేదు. దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరమై డ్రాపౌట్స్‌గా మారుతున్నారు.
– ఎంవీ రామచంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ


