కర్నూలు, చిత్తూరు జట్లు ఘన విజయం | - | Sakshi
Sakshi News home page

కర్నూలు, చిత్తూరు జట్లు ఘన విజయం

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–19 మెన్‌ మల్టీ డే మ్యాచ్‌లు హోరా హోరీగా సాగాయి. మూడవ రోజు జరిగిన ఈ పోరులో వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అనంతపురం జట్టుపై కర్నూలు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా, కేఓఆర్‌ఎం కిక్రెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు జట్టుపై చిత్తూరు జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో కర్నూలు జట్టుకు 12, చిత్తూరు జట్టుకు 7 పాయింట్లు లభించాయి.

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో..

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో మూడవ రోజు ఫాలో ఆన్‌లో 203 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 85.4 ఓవర్లకు 258 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని సాత్విక్‌ 27 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లిఖార్జున అద్భుతంగా బౌలింగ్‌ చేసి 4 వికెట్లు తీశాడు. ఆయి విఘ్నేష్‌ 3 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్నూలు జట్టు 18.5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాయి గణేష్‌ 57 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని సంజయ్‌ నాయుడు, టీవీ సాయి ప్రతాప్‌రెడ్డి సిద్దార్థ వికెట్‌ తీశారు. దీంతో కర్నూలు జట్టు 6 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది.

కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

అదే విధంగా కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 45 ఓవర్లకు 203 పరుగులకు ఆలౌట్‌ అయింది, ఆ జట్టులోని గరు చరణ్‌ 54 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని తేజ సాయి 3, లోకేష్‌ 3, నేత్రనంద 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో న్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 51.5 ఓవర్లకు 233 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని రిషికుమార్‌ రెడ్డి 91, సిద్దార్థ్‌రెడ్డి 31 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని యశ్వంత్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 4 వికెట్లు, జయంత్‌ 3 వికెట్లు తీశాడు. దీంతో చిత్తూరు జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement