న్యాయం కోసం పోరాడితే నిందలా? | - | Sakshi
Sakshi News home page

న్యాయం కోసం పోరాడితే నిందలా?

Jul 18 2026 3:41 AM | Updated on Jul 18 2026 3:41 AM

సోలార్‌ సెయిల్‌ కంపెనీ నిర్వాసితుల ఆవేదన

పెద్దముడియం (జమ్మలమడుగు రూరల్‌): పెద్దముడియం మండలం కల్వటాల గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్‌ సెయిల్‌ కంపెనీలో తమకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పోరాటం చేస్తుంటే.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి నిందలు వేయడం సమంజసం కాదని బాధిత రైతులు వరలక్ష్మీ, సుజాత అన్నారు. శుక్రవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వీరు మాట్లాడుతూ భూపేష్‌రెడ్డి, మామ చంద్రశేఖర్‌రెడ్డి సోలార్‌ కంపెనీ యాజమాన్యంతో తమ వద్దకు వచ్చి మీ భూమిని కోనుగోలు చేస్తామని, మీరు ఆదనంగా సాగు చేసిన భూమికి కూడా ఏకరాకు రూ. 3 లక్షల పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అయిన సోలార్‌ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో చంద్రశేఖర్‌రెడ్డి మాటలు అబద్ధమని తేలిందని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయకపోవడంతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని సంప్రదించామని, ఆయన తమ కోసం మాట్లాడుతుంటే భూపెష్‌రెడ్డి ఆరోపణలు చేయడం తగదని హితవుపలికారు.

నా భర్తపై తప్పుడు కేసు పెట్టారు..

ఏ తప్పు చేయకున్న తన భర్తను సోలార్‌ కంపెనీ యాజమాన్యం, పోలీసులు 33 రోజులుగా జైల్‌లో పెట్టారని మరో బాధితురాలు సుజాత తెలిపారు. తమ పొలంలో సోలార్‌ ప్యానళ్లు వేయవద్దని చెప్పడంతో తన భర్తపై దొంగతనం కేసు పెట్టారని తెలిపారు. తమకు పరిహారం ఇవ్వకుండా జైలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయం కోసం భూపేష్‌రెడ్డి తమకు అన్యాయం చేయవద్దని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement