పోరుమామిళ్ల: అమ్మ దగ్గర నుండి ఆస్తి తీసుకోవాలనే ఆరాటంతో అసలు ప్రాణాలకే ఎసురు తెచ్చుకున్నాడు. మండలంలోని సిద్దవరం గ్రామానికి చెందిన బొట్టా రమణయ్య (46) తన తల్లిని బెదిరించి ఆస్థి రాయించుకోవాలని ఆరాటపడ్డాడు. అక్క వద్దే ఉంటూ తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో రమణయ్య బుధవారం రెండు కత్తులు తీసుకొని తల్లి వద్దకు బయలు దేరాడు. తల్లిని చంపేందుకు రమణయ్య వస్తున్నాడని అక్క తల్లికి ఫోన్ చేసింది. వెంటనే ఆమె పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి తమను కాపాడాలని కోరింది. పోలీసులు రమణయ్య దగ్గరున్న కత్తులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు రమ్మని ఆదేశించారు. దీంతో రమణయ్య భయపడి చెట్టుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రమణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు కడపలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయమై ఎస్‌ఐ హనుమంతును విచారించగా రమణయ్య తల్లిని, సోదరని చంపేందుకు తిరుగుతున్నారని సమాచారం రావడంతో అతని దగ్గర కత్తులు, సెల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.


