కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్‌జోన్ అండర్–19 మెన్ మల్టీ డే అంతర్ జిల్లాల మూడవ విడత మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. బుధవారం కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో తొలి రోజు చిత్తూరు–నెల్లూరు జట్లు తలపడ్డాయి. తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 78.1 ఓవర్లకు 313 పరుగులకు ఆలౌట్ అయింది.ఆ జట్టులోని ఎస్‌ఎంజి ప్రభాకర్ ప్రభాకర్ 186 బంతుల్లో 21 ఫోర్లతో 113 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 9 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 20 పరుగులు చేసింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.........
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కర్నూలు–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్నూలు జట్టు 56.3 ఓవర్లకు 383 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని విఖ్యాత్ 100 బంతుల్లో 11 ఫోర్లు, 15 సిక్సర్లతో 191 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 33 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది.
ఎస్‌ఎంజి ప్రభాకర్, చిత్తూరు (113 పరుగులు)
విఖ్యాత్, కర్నూలు
(191 పరుగులు)


