కలెక్టర్ చర్యలు తీసుకోకుంటే అర్ధనగ్నప్రదర్శన
పుంగనూరు: ప్రతినెల జరిగే ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశానికి తహసీల్దార్, ఆర్‌ఐతో పాటు 27 శాఖల అధికారులు రాకపోవడంతో దళిత నేతలు ధర్నా చేసి , నిరసన తెలిపారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్,మానిటరింగ్ కమిటి సమావేశం నిర్వహించారు. అధికారులు, తహసీల్దార , ఆర్‌ఐ కూడా రాకుండా దళితులను అవమానపరుస్తున్నారని దళిత సంఘాల ప్రతినిధులు అశోక్, నరసింహులు, శంకరప్ప, చెన్నరాయుడు లు మండిపడ్డారు. నామమాత్రపు సమావేశాలు ఎందుకంటూ బహిష్కరించి అన్నమయ్య జిల్లా పుంగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి, నినాదాలు చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని , లేకపోతే అర్ధనగ్నప్రదర్శనలతో ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు పెంచుపల్లి కృష్ణ, రమణ, రాజ, శంకర, రామకృష్ణ, తోటనరసింహులు, శ్రీనివాసులు పాల్గొన్నారు.


