విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధం

May 28 2026 1:58 AM | Updated on May 28 2026 1:58 AM

చాపాడు : మండల పరిధిలోని గుంతచీపాడు గ్రామంలో గుద్దేటి రవిశంకర్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటిలో బుధవారం తెల్లవారుజామున విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. దీనివల్ల రూ.2లక్షల విలువ చేసే ఇంటిలోని సామాగ్రి, వరి ధాన్యం, యూరియా బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచడంతో పాటు పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో గుంతచీపాడులోని రవిశంకర్‌రెడ్డి ఇంటిలో తెల్లవారుజామున ఒక్క సారిగా మంటలు లేచాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఇంటిలోని వాషింగ్‌ మిషన్‌, 15 బస్తాల యూరియా, 10 బస్తాల వరి ధాన్యం, రెండు పవర్‌ స్పైయర్‌ మిషన్లు, నాలుగు పెద్ద టార్పాలిన్‌ పట్టలు, రెండు స్టార్టర్లు, రెండు ప్యాన్లు, ఒక వ్యవసాయ విద్యుత్‌ మోటార్‌, విద్యుత్‌ వైర్లు, ఇంటిలోని సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. రూ.2లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు రవిశంకర్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జరిగిన సంఘటన, నష్టంపై ప్రభుత్వం ఆదుకోవాలని రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందించినట్లు బాధితుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement