కలకడ : మతిస్థిమితం లేని తన తండ్రి ఆచూకీ తెలియజేయాలని తనయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమారుడు కేతంరెడ్డి శివకుమార్‌రెడ్డి (బాధితుడి) కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం బాలయ్యగారిపల్లె పంచాయతీ ఆరిపెంటదిన్నె గ్రామానికి చెందిన కేతంరెడ్డి వెంకట్రమణరెడ్డి(72), 5 ఏళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు. అప్పటి నుంచి కుమారుడు శివకుమార్‌రెడ్డి చికిత్స చేయిస్తూ, చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లిన సమాచారం తెలుసుకుంటూ తిరిగి ఇంటికి తీసుకువచ్చేవాడు. 8వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన అతని తండ్రి జాడ తెలియకపోవడంతో చుట్టుపక్కల విచారించినా ఫలితం లేదన్నారు. దీంతో ఆయన ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిస్తే 9441495608ను కానీ, కలకడ పోలీస్‌స్టేషన్‌ను గానీ సంప్రదించాలని కోరారు.


