కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధితులకు సత్వరమే న్యాయం అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రకాష్‌బాబు, మహిళా పీఎస్ డీఎస్పీ బాలస్వామిరెడ్డిలు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్


