రాధాకృష్ణ ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యాఖ్యలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రాధాకృష్ణ ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యాఖ్యలు చేయాలి

Apr 7 2026 7:43 AM | Updated on Apr 7 2026 7:43 AM

కడప కార్పొరేషన్‌ : ఏబీఎన్‌ ఛానెల్‌ ఎండీ రాధాకృష్ణ ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యాఖ్యలు చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్‌ బూసిపాటి హెచ్చరించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘రేపు ... మీ భార్యలు.. మీ భార్యలు కాదని జగన్‌మోహన్‌ రెడ్డి చెబితే గుడ్డిగా నమ్మేసి... కట్టుకున్నదాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు కూడా చూడటానికి వెరవని వెన్నుముక లేని బ్యాచ్‌ వైఎస్సార్‌సీపీలో తయారైందని రాధాకృష్ణ మాట్లాడటం చాలా అభ్యంతరకరమన్నారు. ఆ మాటలు వింటుంటే ఒంటినిండా కులగజ్జితో , ఎంగిలి మెతుకులు ఏరుకుంటూ, బతుకుతున్న నీ స్వభావం గురించి నువ్వే చెప్పుకున్నట్టు అనిపించడం లేదా... అని ప్రశ్నించారు. ఏ పార్టీ అయినా నాయకుడి అడుగుజాడల్లో నడుస్తుందని, అది పార్టీ శ్రేణుల కర్తవ్యమన్నారు. అంతమాత్రానికే తల్లికి, భార్యకు తేడా తెలియని నీలాంటి వారు పార్టీ శ్రేణుల విధేయతను కించపరుస్తూ మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. జర్నలిజం ముసుగులో అక్షర వ్యభిచారం చేస్తున్న నీలాంటి వారు సూక్తులు చెబితే జనం నోటితో నవ్వడం లేదని, అడవులు సంరక్షణ గురించి వీరప్పన్‌, ప్రపంచ శాంతి గురించి బిన్‌లాడెన్‌ ఉపన్యాసం ఇచ్చినంత చండాలంగా ఉందన్నారు. ఏ పార్టీ అభిమానులు ఎలా ఉండాలో చెప్పడానికి నీవు ఎవరని ప్రశ్నించారు. మీరు ఎన్టీఆర్‌ను రాముడిగా చూపిస్తే మొక్కాలి, అదే వ్యక్తిని డ్రామారావు, కామారావుగా చూపిస్తే అసహ్యించుకోవాలా...చెప్పులు వేయించి పైకి పంపిస్తే చప్పట్లు కొట్టాలా అని సూటిగా ప్రశ్నించారు. మీరు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెబితే... మేము తలలు ఊపాలి, హోదా వల్ల ఉపయోగం లేదు..ప్యాకేజీ ముద్దు అంటే అవునంటూ వెనక నడవాలా అని నిలదీశారు. మీరు కాంగ్రెస్‌తో జట్టు కట్టి మోడీని తిడితే మీకు జేజేలు పలకాలి, మీరు బీజేపీతో ఉంటూ సోనియాను తిడితే చప్పట్లు కొట్టాలా...రాష్ట్రం అప్పుల్లో ఉంది , ఆర్థిక పరిస్థితి బాగోలేదు , వచ్చిన ఆదాయం జీతాలకే సరిపోవడం లేదు అని మీరు చెబితే నమ్మాలి, మళ్లీ అదే నోటితో లక్ష ఎకరాల విస్తీర్ణంలో కొన్ని లక్షల కోట్లు తగలబెట్టి ... 50 ఏళ్ల పాటు ప్రపంచస్థాయి రాజధానిని కడతామని చెబితే ఊకొట్టాలా ఇదేం నీతి అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఢిల్లీ వెళ్లి . ప్రధాని ని కలిస్తే .‘అమ్మ జగనా‘అంటూ హెడ్డింగ్‌ పెట్టి . కేసులు మాఫీ కోసం వెళ్ళాడని రాస్తారు, మీ కులపోడు ప్రతిపక్షనేతగా ఢిల్లీ వెళ్లి అక్కడ అందరి కాళ్ళు పట్టుకుంటే.. మావాడు ఢిల్లీని వణికించాడని ... అక్కడ చక్రం తిప్పాడని ... లుచ్చా రాతలు రాస్తారన్నారు. ఇప్పటికై నా అక్షర వ్యభిచారం మానుకోవాలని.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తలు, వ్యాఖ్యలు చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా వైద్య విభాగం సభ్యులు డాక్టర్‌ పి పెంచలయ్య పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్‌ బూసిపాటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement