కడప అర్బన్ : వైఎస్‌ఆర్ కడప జిల్లాలో కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీ.వి.రాఘవరెడ్డి, ఉపాధ్యక్షులుగా వి.రాజగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎం.హరి గణేష్‌లు విజయం సాధించారు.సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.మొత్తం 729 ఓట్లకు గాను 617 ఓట్లు పోల్ అయ్యాయి. కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పోటీ చేసిన జి.వి. రాఘవరెడ్డి 96 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అధ్యక్షులుగా పోటీచేసిన అభ్యర్థులలో జీ.వి.రాఘవరెడ్డికి 322, బొగ్గుల గురప్ప్ర నాయుడుకు 226, యు.శేషయ్యకు 62 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షులుగా పోటీచేసిన వి.రాజగోపాల్ రెడ్డి 7 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా పోటీ చేసి న అభ్యర్థులలో వి.రాజగోపాల్ రెడ్డికి 310 ఓట్లు పోలయ్యాయి.డాక్టర్ జాల ప్రభాకర్‌కు 303 ఓట్లు పోలయ్యాయి. కడప బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎం. హరి గణేష్ 124 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా పోటీచేసిన హరి గణేష్ కు 278, భువన్ ఏకాదశి రెడ్డికి 161, ఎం.వి.సుబ్బారామయ్యకు 118, సుందర్ రాజుకు 55 ఓట్లు పోలయ్యాయి.సెక్రెటరీ –1 గా ఎస్. వి.కిషోర్ కుమార్,జాయింట్ సెక్రెటరీ–2 గా పి.సుధారాణి,కోశాధికారిగా ఏ. ఉమాదేవి,మహిళా ప్రతినిధిగా ఎన్.,అనురాధ,లైబ్రరీ సెక్రటరీగా పి.సురేష్ కుమార్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఐ.రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


