కూటమికి వ్యతిరేకంగా మార్పు మొదలైంది | - | Sakshi
Sakshi News home page

కూటమికి వ్యతిరేకంగా మార్పు మొదలైంది

Apr 1 2026 8:42 AM | Updated on Apr 1 2026 8:42 AM

హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లకు సత్కార సభలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

మైదుకూరు : అభివృద్ధి, సంక్షేమంలో హామీలను నెరవేర్చడంలో, పాలనలో విఫలమైన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో మార్పు మొదలైందని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. మైదుకూరులో మంగళవారం మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లకు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.7,500 కోట్ల పంటల బీమా ఇవ్వగా కూటమి ప్రభుత్వం పైసా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ రెండేళ్లలో రైతులకు రూ.3 వేల కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. కేంద్రం ఇచ్చేది మినహా కూటమి ప్రభుత్వం ఒక పైసా ఇవ్వలేదని తెలిపారు. మహిళలకు, విద్యార్థులకు మొండి చేయి చూపిందని ఆరోపించారు. సర్పంచ్‌ పదవి అనేది ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, దానిని ఐదేళ్లపాటు ప్రజా సేవగా భావిస్తూ నిర్వహించిన వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లకు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి తోడు వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లు, కార్యకర్తలు వారిలో మరింత చైతన్యం తీసుకురావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో సర్పంచ్‌ నుంచి జెడ్పీటీసీల వరకు అభ్యర్థి ఎవరైనా అన్ని వైఎస్సార్‌సీపీ వారే గెలవాలని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కూటమికి భంగపాటు తప్పదు

వచ్చే ఎన్నికల్లో కూటమికి భంగపాటు తప్పదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో 90 పంచాయతీల్లో 82 వైఎస్సార్‌సీపీ గెలిచిందని, రానున్న ఎన్నికల్లో మొత్తం గెలవాలని అన్నారు. మైదుకూరు నుంచి శెట్టిపల్లె రగురామిరెడ్డిని, పార్లమెంట్‌ స్థానం నుంచి వైఎస్‌ అవినాష్‌రెడ్డిని త్రిబుల్‌ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా వస్తే 40 ఏళ్లపాటు అధికారంలో ఉంటారని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్పంచ్‌లకు విశేష అధికారాలు ఇచ్చారని, మళ్లీ ఆయనను సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జెడ్పీ చైర్మన్‌ ముత్యాల రామగోవిందరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యమని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శెట్టిపల్లె రఘురామిరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెబుతామని ప్రజలే అంటున్నారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వంపై తమ అసంతృప్తిని ప్రకటిస్తారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సర్పంచ్‌లు ప్రజా సమస్యలపై స్పందించి వారి మన్ననలను పొందాలని సూచించారు. మైదుకూరు నియోజకవర్గ పరిశీలకుడు, బద్వేలు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వాకమల్ల రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు.

సర్పంచ్‌లకు ఆత్మీయ సత్కారం

కార్యక్రమంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌, జెడ్పీ చైర్మన్‌ ఎం.రామగోవిందరెడ్డి, మైదుకూరు నియోజకవర్గ పరిశీలకుడు వాకమల్ల రాజగోపాల్‌రెడ్డి తదితరులు నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లను శాలువా, పూలమాల, జ్ఞాపికతో ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement