సీతారాముల కల్యాణం నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపు | - | Sakshi
Sakshi News home page

సీతారాముల కల్యాణం నేపథ్యంలో ట్రాఫిక్‌ మళ్లింపు

Mar 31 2026 8:32 AM | Updated on Mar 31 2026 8:32 AM

కడప అర్బన్‌ : వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ఏప్రిల్‌ 1 న ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్‌ మళ్లింపు అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్పీ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. మళ్లింపు ఏప్రిల్‌ 1 వ తేదీ ఉదయం 9 నుంచి 2 వ తేదీ ఉదయం 8 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు. వాహనదారులు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు.

వాహనాల దారి మళ్లింపు వివరాలు

● కడప నుండి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్‌ పల్లె ఇర్కాన్‌ జంక్షన్‌ నుంచి ఊటుకూరు సర్కిల్‌, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్ళాలి.

● తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి.

● రాజంపేట వైపు నుంచి కడప వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లింపు. రాజంపేట వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు సాలాబాద్‌ నుంచి ఇబ్రహీం పేట, మాధవరం మీదుగా పంపుతారు.

వాహనదారులు పోలీసు శాఖకు సహకరించాలి : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement